కూటమి సర్కార్ వైఫల్యాలపై వైసీపీ శ్రేణులు పోరాడాలన్న జగన్
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రీజనల్ కో-ఆర్డినేటర్లను ఆదేశించారు. ప్రతీ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని సూచించారు. పోలీసుల అండతో కూటమి నేతలు గెలవాలని చూస్తున్నారని, ఈ అక్రమాలను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. గడిచిన రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలన సంపూర్ణంగా విఫలమైందని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.