ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నాయకుల వ్యవహారం: క్రైమ్ బ్రాంచ్‌కు మరో కేసు బదిలీ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలపై నమోదైన మరో కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేసినట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు. జంతర్ మంతర్ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలతో అక్టోబర్ 13వ తేదీన వీరిని అదుపులోకి తీసుకుని రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిందితుల కస్టడీని పొడిగిస్తూ అధికారులు తదుపరి దర్యాప్తు వేగవంతం చేశారు.