వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మనోజ్ బాజ్‌పాయ్

రిపోర్టర్: విజయ్ స్థలం: ఢిల్లీ

తన పేరు, ఫొటోలు, గొంతును కృత్రిమ మేధ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనధికారికంగా వాడుకుంటున్నారని ఆరోపిస్తూ ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ ధర్మాసనం విచారించింది. ఎచ్2పీజీ డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన ఫొటోలను వాణిజ్య ప్రకటనల కోసం దుర్వినియోగం చేస్తోందని, ఏఐ టూల్స్ ద్వారా తన గొంతును కాపీ చేస్తున్నారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.