విద్యార్థులకు అలర్ట్: బీహార్ బోర్డు టెన్త్ ఇంటర్ సెంట్-అప్ పరీక్షల షెడ్యూల్ విడుదల
రిపోర్టర్: వెంకట్
స్థలం: బీహార్
బీహార్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు 2027 వార్షిక పరీక్షల కోసం మెట్రిక్ మరియు ఇంటర్మీడియట్ సెంట్-అప్ పరీక్షల షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు నవంబర్ 19 నుండి నవంబర్ 28 వరకు, టెన్త్ పరీక్షలు నవంబర్ 23 నుండి నవంబర్ 27 వరకు రెండు విడతలుగా జరుగుతాయని బోర్డు స్పష్టం చేసింది. ఈ పరీక్షల్ లో హాజరుకాకపోతే వార్షిక పరీక్షలకు అనుమతించబోమని హెచ్చరించారు.