న్యాయవాదుల సంక్షేమ నిధులు పెంచాలంటూ ఖమ్మంలో లాయర్ల ధర్నా

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం అర్బన్

ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు బుధవారం జిల్లా కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. డెత్, రిటైర్మెంట్ బెనిఫిట్ను రూ.25 లక్షలకు పెంచాలని, న్యాయవాదులకు వైద్య సహాయం కింద రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల స్టైఫండ్ను ఐదేళ్లపాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అధ్యక్షుడు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.