నెల్లూరులో డీజేల హోరుతో పెరుగుతున్న వినికిడి సమస్యలు
రిపోర్టర్: గోపి
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో వినాయక చవితి నిమజ్జన వేడుకల్లో డీజేలు, భారీ శబ్దాల స్పీకర్ల వినియోగం పెరగడంతో ధ్వని కాలుష్యం తీవ్రమవుతోంది. పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకుండా నిర్వాహకులు భారీ శబ్దాలు చేస్తుండటంతో హృద్రోగులు, స్థానికులు ఇబ్బందిపడుతున్నారు. ఈ భారీ శబ్దాల ప్రభావంతో వినికిడి సమస్యలు ఎదుర్కొంటూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న యువత సంఖ్య పెరుగుతోందని ఈఎన్టీ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.