పేదలకు భరోసాగా ఆయుష్మాన్ భారత్ ఎనిమిదేళ్ళు

రిపోర్టర్: కృష్ణ స్థలం: New Delhi

దేశ ప్రజలందరికీ అత్యుత్తమ వైద్యం అందాలనే సంకల్పంతో ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని, నిరుపేదల ప్రాణాలను కాపాడటంలో ఈ పథకం చారిత్రాత్మక పాత్ర పోషిస్తోందని ప్రధాని పేర్కొన్నారు.