వైద్య సాయం: ఇద్దరు బాధితులకు ఎల్వోసీలు మంజూరు చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

రిపోర్టర్: సతీష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తక్షణ సాయం అందినట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. బాధితుల పరిస్థితిని స్వయంగా తెలుసుకుని స్పందించిన ఆమె, వారి మెరుగైన చికిత్స కోసం మొత్తం మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల విలువైన లేఖలను మంజూరు చేయించారు. ఇందులో భాగంగా నిమ్మల మేఘనకు డెబ్బై ఐదు వేల రూపాయలు కేటాయించినట్లు స్పష్టం చేశారు.