యువత కష్టాల్లో ఉంటే సెలబ్రిటీలు మౌనం వీడాలి: పార్వతి తిరువోతు
రిపోర్టర్: రమేష్
స్థలం: కేరళ
యువత కష్టాల్లో ఉన్నప్పుడు సినీ నటులు మౌనంగా ఉండటం సరికాదని ప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువోతు అన్నారు. అభిమానుల ఆదరణతోనే సెలబ్రిటీలు ఉన్నత స్థానానికి చేరుకుంటారని, అలాంటిది సామాజిక సమస్యలపై స్పందించకపోవడం వన్-సైడ్ రిలేషన్షిప్ లాంటిదని ఆమె మండిపడ్డారు. నటులు రాజకీయాలకు దూరంగా ఉండాలనే రోజులు ఎప్పుడో చెల్లిపోయాయని, సామాజిక అంశాలపై మాట్లాడటం ప్రతి కళాకారుడి బాధ్యత అని స్పష్టం చేశారు.