రాజ్కోట్లో ఆటో డ్రైవర్పై పెంపుడు కుక్కతో దాడి

రిపోర్టర్: కృష్ణ స్థలం: राजकोट

గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్ నగరంలోని మావ్డి ప్లాట్ ప్రాంతంలో పాత కక్షల నేపథ్యంలో ఆటో డ్రైవర్ కిషన్ మేవాడపై దీప్ జడేజా అనే వ్యక్తి కిరాతక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడు జడేజా తన పెంపుడు జర్మన్ షెపెడ్ కుక్కను ఉసిగొల్పి డ్రైవర్ను కరిపించడంతో పాటు ఇనుప గొలుసుతో తీవ్రంగా కొట్టాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.