అల్లినగరంలో ఘనంగా శ్రీ శక్తి యువజన సంఘం భారీ అన్నదానం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఎచ్చెర్ల

ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో వినాయక చవితి వేడుకల సందర్భంగా శ్రీ శక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. మధ్యాహ్నం ప్రారంభమైన ఈ వేడుకకు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా భక్తులు హాజరై స్వామివారి ప్రసాదం స్వీకరించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారింది.