నర్సంపేట హాస్టల్ విద్యార్థుల సంచారంతో తీవ్ర భయాందోళనలో స్థానికులు
రిపోర్టర్: Rajashekar
స్థలం: నర్సంపేట
నర్సంపేటలోని టీటీడబ్ల్యూయూఆర్‌జేసీ హాస్టల్ విద్యార్థుల రాత్రివేళ సంచారంతో సమీప నివాసితులు భయాందోళనకు గురవుతున్నారు. బాత్రూమ్ పరిసర ప్రాంతాలకు వస్తూ ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. వార్డెన్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కుటుంబాలు కోరుతున్నాయి.