ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఉత్సాహంగా ప్రతిభా పాటవ పోటీలు
రిపోర్టర్: సతీష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. సమాజంపై ఎల్‌నినో ప్రభావం- ఎదుర్కొనే మార్గాలు అనే అంశంపై జరిగిన వ్యాసరచన పోటీల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. ఉదయగిరి, ఏఎస్‌పేట, సంగం ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో విజేతలకు ప్రిన్సిపళ్లు, ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు.