హైదరాబాద్ లో బీజేపీ మహా పాదయాత్ర: మార్గాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
నవంబర్ 2న హైదరాబాద్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరగనున్న బీజేపీ మహా పాదయాత్ర మార్గాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావుతో కలిసి పరిశీలించినట్లు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా నగరంలో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్ల గురించి పోలీస్ ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని తగు ఏర్పాట్లను పరిశీలించారు.