ఏపీ పీఆర్సీ చైర్మన్గా రిటైర్డ్ ఐపీఎస్ దినేష్ కుమార్ నియామకం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పన్నెండవ వేతన సవరణ కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దినేష్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మొదట నియమితులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ఈ నియామకం జరిగింది. సెప్టెంబర్ 5న ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ చైర్మన్ నియామకంతో ఉద్యోగుల జీతభత్యాల సవరణ ప్రక్రియ వేగవంతం కానుంది.