విద్యుత్ స్తంభం విరిగి మీద పడి వృద్ధురాలు మృతి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెర్లాం

విజయనగరం జిల్లా తెర్లాంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సొంత టేకు చెట్టును కొట్టివేయిస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. చెట్టు విద్యుత్ తీగలపై పడటంతో స్తంభం విరిగి అచ్చియమ్మ అనే 84 ఏళ్ల వృద్ధురాలిపై పడింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.