క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని పిలుపునిచ్చిన అతిథులు

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ కాసిపేట గురుకుల కళాశాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్-19 వాలీబాల్ ఎంపిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డి.ఐ.ఇ.ఒ అంజయ్య, రూరల్ సి.ఐ హనోక్, ప్రిన్సిపాల్ ఊటూరి సంతోష్ కుమార్, ఎస్.జి.ఎఫ్ సెక్రెటరీ బి.బాపురావు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనగా, ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.