జాతీయ జెండా ప్రదర్శన నిషేధంపై కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దీప్కే తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఢిల్లీ

పార్టీ నేతల అరెస్టును ఖండిస్తూ అక్టోబర్ 16న ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో భారీ త్రివర్ణ పతాక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వెల్లడించారు. దేశంలో జాతీయ జెండాను ప్రదర్శించడం ఎప్పటికీ నేరం కాదని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు. జాతీయ జెండా మనందరికీ ఎంతో గర్వకారణమని పేర్కొంటూ, దేశభక్తి గల ప్రతి ఒక్కరూ భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.