కాకినాడలో ఘనంగా భారతీయం కార్యక్రమం నిర్వహించిన మంత్రి నారా లోకేష్
రిపోర్టర్: సతీష్
స్థలం: కాకినాడ
కాకినాడలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలను పెంపొందించడమే లక్ష్యంగా తరగతి గది నుంచే మార్పు రావాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఈ ఏడాది భారీగా విద్యార్థులు మారడం విద్యావ్యవస్థపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని ఆయన తెలిపారు.