'అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు': ఖమ్మంలో రెవెన్యూ అధికారుల హెచ్చరిక

రిపోర్టర్: సతీష్ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు సర్వే నంబర్ 142లో రూ.15 కోట్ల విలువైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా ప్రయత్నం నుండి రెవెన్యూ అధికారులు కాపాడారు. జిపిఓ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థలాన్ని స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అయితే గిరిజనుల విషయంలో ఒకలా, ఇక్కడ మరోలా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.