వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ బొత్స అనూష

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూష బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించినందుకు ఆమె జగన్కు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆమెకు జగన్ సూచించారు.