హర్మూజ్ జలసంధిలో కొత్త మార్గాల ఏర్పాటుకు ఇరాన్, ఒమన్ నిర్ణయం

రిపోర్టర్: సునీల్ స్థలం: World

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఇరాన్, ఒమన్ దేశాలు హర్మూజ్ జలసంధిలో కొత్త ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. గల్ఫ్ దేశాలకు త్వరలో ఈ వివరాలు వెల్లడికానున్నాయి. దిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో అమెరికా ఆంక్షలపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా సంక్షోభంపై చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యమని బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.