జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

హైదరాబాద్లోని బేగంపేట్ హోటల్ ది ప్లాజాలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు కాలుష్య నియంత్రణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. డంపింగ్ యార్డు సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా మేధావులు, పర్యావరణ వేత్తలు మరియు స్థానిక బాధితులతో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.