దేశంలో డిజిటల్ విప్లవం తెచ్చిన ప్రధాని మోదీ
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
ఒక్క క్లిక్‌తో అరచేతిలోనే సకల సేవలు అందిస్తూ సామాన్యుడికి డిజిటల్ సాధికారత కల్పించిన దార్శనికుడు ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపీ తెలంగాణ కొనియాడింది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టాలు తప్పించి, సుపరిపాలనను ప్రజల ముంగిటకు తెచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేసింది. డిజిటల్ ఇండియా ద్వారా దేశ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని పేర్కొంది.