విద్యార్థులకు అలర్ట్: తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశలు, జూనియర్ కాలేజీలకు దసరా సెలవుల షెడ్యూల్ను విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. అక్టోబర్ పదవ తేదీ నుంచి సెలవులు ప్రారంభం కానున్నట్లు వారు స్పష్టం చేశారు. పాఠశాలలకు పదమూడు రోజులు, ఇంటర్ కాలేజీలకు పన్నెండు రోజుల పాటు హాలిడేస్ వర్తిస్తాయని వెల్లడించారు. సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ యాజమాన్యాలను తీవ్రంగా హెచ్చరించింది.