లక్నోలో టెన్షన్: ఎలాన్ మస్క్తో సహా పదిమందితో రావణాసురుని పోస్టర్లు కలకలం

రిపోర్టర్: వెంకట్ స్థలం: Lucknow

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సనాతన రక్షా సంఘటన్ ఏర్పాటు చేసిన పోస్టర్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. దశరా పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్లో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులను పది తలల రావణాసురుని రూపంలో చిత్రించారు. భారత్ వ్యతిరేక శక్తులంటూ పేర్కొన్న ఈ పోస్టర్ల ప్రదర్శనపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.