యాప్ స్టోర్ నిబంధనలు కఠినతరం చేసిన యాపిల్: డేటింగ్ యాప్లపై కీలక నిర్ణయం

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

మైనర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని యాప్ స్టోర్ నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. డేటింగ్ యాప్లు మరియు కృత్రిమ మేధస్సు ఆధారిత వర్చువల్ కంపానియన్ సేవలకు పద్దెనిమిదేళ్లు నిండిన వారు మాత్రమే అర్హులని టెక్ దిగ్గజం యాపిల్ స్పష్టం చేసింది. ఈ కొత్త మార్పులు వచ్చే నవంబర్ పదహారు నుంచి అమల్లోకి వస్తాయని, డెవలపర్లు నిబంధనలను కచ్చితంగా పాటించాలని యాపిల్ కంపెనీ వెల్లడించింది.