సోమశిల ఎఫ్డీఆర్ పనుల అవకతవకలపై విజిలెన్స్ విచారణ

రిపోర్టర్: అశోక్ స్థలం: నెల్లూరు

సోమశిల ప్రాజెక్టు ఎఫ్డీఆర్ నిధుల గోల్మాల్ వ్యవహారంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయి, చేజెర్ల మండలాల్లో పనులలో జరిగిన అవకతవకలను ఈనాడు వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. విజిలెన్స్ అధికారులు విచారణకు రానున్న నేపథ్యంలో అక్రమార్కులు హడావిడిగా పొక్లెయిన్లతో కాలువ పనులు చేయిస్తున్నారు. నాగులవెల్లటూరు దక్షిణ కాలువ కింద ఎలాంటి పనులు చేయకుండానే నిధులు కాజేసే ప్రయత్నం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.