దర్శకుడిగా మారుతున్న ప్రముఖ నటుడు ఉన్ని ముకుందన్

రిపోర్టర్: విజయ్ స్థలం: केरल

మలయాళ ప్రముఖ నటుడు, నిర్మాత ఉన్ని ముకుందన్ తన కెరీర్‌లోని మైలురాయి అయిన 50వ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ చిత్రానికి ఆయన కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఉన్ని ముకుందన్ ఫిలిస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను పనోరమ స్టూడియోస్ అధినేతలు కుమార్‌ మంగత్‌ పాఠక్, అభిషేక్‌ పాఠక్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తన స్వంత గొంతుతో కథలు చెప్పాలనే కోరికతో ఈ అడుగు వేస్తున్నట్లు ఉన్ని ముకుందన్ తెలిపారు.