విశాఖపట్నంలో ఏడుగురు పోలీసు అధికారుల ఉద్యోగ విరమణ ఘన సత్కారం
రిపోర్టర్: కిరణ్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నగరంలో వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులను పోలీస్ కమీషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మరియు ఇతర ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఒక ఏఎస్ఐ, ఇద్దరు ఏఆర్ఎస్ఐలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. వారి దీర్ఘకాలిక సేవలను కొనియాడుతూ అధికారులు అభినందనలు తెలిపారు. పోలీసు శాఖలో వారు అందించిన నిబద్ధతతో కూడిన సేవలు ఎప్పటికీ స్మరణీయమని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.