ఢిల్లీలో కలకలం: కోక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలకు ఐదు రోజుల జైలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఢిల్లీ
జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనకు యత్నించిన కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు వారి తరఫు న్యాయవాది అభిష్త్ హేలా వెల్లడించారు. భవిష్యత్తులో నేరం చేయొచ్చనే అనుమానంతోనే పోలీసులు కోర్టులో తప్పుడు వివరాలు సమర్పించారని, ఎలాంటి బాండ్ నిబంధనలను ఉల్లంఘించలేదని ఆయన తీవ్రంగా ఆరోపించారు.