గణేష్ నిమజ్జనానికి హైడ్రా ఆధ్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
భక్తిశ్రద్ధలతో పూజల అనంతరం గణనాథుడి నిమజ్జన కార్యక్రమానికి హైదరాబాద్ నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ప్రధాన నిమజ్జన ఘట్టం ప్రారంభం కానుండగా, భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైడ్రా పటిష్ట ఏర్పాట్లు చేసింది. హుస్సేన్‌సాగర్‌తో పాటు వివిధ చెరువుల వద్ద మూడు షిఫ్టుల్లో మొత్తం 150 మంది స్విమ్మర్లను అందుబాటులోకి తెచ్చినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. మిగతా శాఖలతో కలిసి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.