మల్లన్నసాగర్ నింపి పంటలను కాపాడాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్
రిపోర్టర్: మహేష్
స్థలం: సిద్దిపేట
మల్లన్నసాగర్ జలాశయాన్ని వెంటనే పూర్తిగా నింపి, కూడవెల్లి వాగులో నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుబ్బాక మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సాగునీరు అందక రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని, తాగునీరు వృథా కాకుండా అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.