కరవు నివారణకు నూతన ప్రాజెక్ట్: రూ. 150 కోట్లతో శాశ్వత చర్యలు

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూ. 150 కోట్ల వ్యయంతో శాశ్వత నివారణ చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, జాతీయ విపత్తుల నిర్వహణ నిధి సహకారంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు వెల్లడించారు. వర్షాధార వ్యవసాయ ప్రాంతాల అభివృద్ధి, రైతు కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు.