మియాపూర్లో భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం పోటాపోటీగా లడ్డూ వేలం
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
మియాపూర్ టి.ఎన్. నగర్ కాలనీలో అవిఘ్న యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గణనాథుడి లడ్డూ ప్రసాదం వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలి లడ్డూను లక్షా ముప్పై ఐదు వేల రూపాయలకు పవన్ తేజ్ దక్కించుకోగా, భక్తుల జయజయధ్వానాల నడుమ శోభాయాత్ర కోలాహలంగా సాగింది.