మృత్యు నిశ్శబ్ద నీడలో వినాయక నిమజ్జన స్థల పరిశీలన
రిపోర్టర్: BALUGURI VENKHATAREDDY
స్థలం: వలిగొండ
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో వినాయక నిమజ్జన స్థలాన్ని తహసిల్దార్ దశరథ నాయక్, ఎంపీడీవో జి జలంధర్ రెడ్డి, ఎస్సై ఏ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పరిశీలించారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఉత్సవాలను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.