తితిదే డిప్యూటీ ఈవో లోకనాథంపై సస్పెన్షన్‌ వేటు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తిరుపతి

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తితిదే డిప్యూటీ ఈవో లోకనాథంను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. సీబీఐ నేతృత్వంలోని సిట్‌ సమాచారం మేరకు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించగా, 48 గంటలపాటు జైలులో ఉన్న నేపథ్యంలో సర్వీసు నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు శ్రీవారి ఆలయ గోపురంపై శ్రీకృష్ణుడి విగ్రహ మరమ్మతులపై దుష్ప్రచారం చేయవద్దని తితిదే స్పష్టం చేసింది.