మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై వైఎస్ షర్మిల తీవ్ర నిప్పులు

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ఓట్లు మీరే వేసుకుని గెలుపు మీదేనని ప్రకటించుకుంటే ప్రజలతో పనేంటని ఆమె నిలదీశారు. టీడీపీ, జనసేన, బీజేపీల విజయం ప్రజా తీర్పు కాదని, అధికార మదానికి రాక్షస తత్వానికి తార్కాణమని దుయ్యబట్టారు. ఎన్నికల సంఘాన్ని, పోలీసు వ్యవస్థను గుప్పిట్లోకి తీసుకుని బలవంతపు గెలుపు సాధించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.