క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్: ఆక్లాండ్ నెట్స్ లో విరాట్ కోహ్లీ చెమటోడ్పులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఆక్లాండ్
న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లీ ఆక్లాండ్ లోని నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. ప్రాక్టీస్ సెషన్ లో భారీ షాట్లతో హోరెత్తిస్తూ అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్నట్లు తెలిపాయి. ఈ పర్యటనలో టీమిండియా అంచనాలను అందుకోవడానికి ఆటగాళ్లు ప్రత్యేక కసరత్తులు చేస్తున్నారని, అభిమానుల్ లో భారీ ఆసక్తి నెలకొందని క్రీడా విశ్లేషకులు పేర్కొన్నారు.