ఆర్టీఐ దరఖాస్తుల దుర్వినియోగం: పల్నాడు వ్యక్తిపై సమాచార కమిషన్ కీలక చర్యలు

రిపోర్టర్: అశోక్ స్థలం: పల్నాడు

సమాచార హక్కు చట్టం దరఖాస్తులను పదేపదే దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో ఏపీ సమాచార కమిషన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లా వేల్పూరుకు చెందిన యడ్ల భద్రయ్య ఇప్పటివరకు వెయ్యికి పైగా ఆర్టీఐ దరఖాస్తులు, మూడు వందలకు పైగా రెండో అప్పీళ్లు దాఖలు చేసినట్లు కమిషన్ గుర్తించింది. ఇప్పటికే సమాచారం అందించిన అంశాలపైనే మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయడంపై ఆంక్షలు విధిస్తూ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.