బోనకల్ గురుకుల పాఠశాలలో తీవ్ర ప్రమాదం: స్లాబ్ పెచ్చులు ఊడిపడి ఇద్దరు విద్యార్థినులకు గాయాలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: బోనకల్
ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి గదిలో శనివారం స్లాబ్ పెచ్చులు ఊడిపడిన ఘటనలో పూజిత, కీర్తన అనే ఇద్దరు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రాణాలకు ముప్పుగా మారిందని, విద్యార్థుల భద్రతను విస్మరిస్తున్న అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సర్పంచ్ బానోతు జ్యోతి కొండతో పాటు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ డిమాండ్ చేశారు.