వైద్య రంగంలో అరుదైన ఘనత: నవజాత శిశువుకు విజయవంతంగా కాలేయ మార్పిడి
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ బంజారాహిల్స్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు మరో అరుదైన మైలురాయిని సాధించారని వైద్య బృందం వెల్లడించింది. కేవలం రెండున్నర కిలోల బరువున్న ఆరు వారాల నవజాత శిశువుకు అత్యంత సంక్లిష్టమైన జీవించి ఉన్న దాత కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. తల్లి దానం చేసిన అరవై రెండు గ్రాముల కాలేయ బాగాన్ని చిన్నారికి అమర్చామని, ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉండి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని వైద్యులు స్పష్టం చేశారు.