డిెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లో రికార్డు: అక్టోబర్ లో 14,659 రైళ్ల రాకపోకలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: India
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లో రికార్డు స్థాయి రవాణా నమోదైందని Ministry of Railways వెల్లడించింది. అక్టోబర్ నెలలో ఏకంగా 14,659 రైళ్ల రాకపోకలతో సరికొత్త రికార్డు సృష్టించినట్లు అధికారులు స్పష్టం చేశారు. సరుకు రవాణా రంగంలో ఇది అత్యధిక నెలవారీ ప్రయాణమని తెలిపారు. ఈ సరికొత్త మైలురాయి దేశ ఆర్థిక ప్రగతికి ఊతమిస్తుందని పేర్కొంటూ రైల్వే మంత్రిత్వ శాఖ ఈ వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలతో పంచుకుంది.