రాజాపేట మండలంలో నిబంధనలకు విరుద్ధంగా బార్లను తలపిస్తున్న దాబాలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల పరిధిలోని పొట్టిమర్రి గ్రామంలో దాబాలు నిబంధనలకు విరుద్ధంగా బార్లను తలపిస్తున్నాయంటూ స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భోజన కేంద్రాలుగా ఉండాల్సిన ఈ దాబాలలో రాత్రి పన్నెండు గంటల వరకు కార్యకలాపాలు సాగుతున్నాయని, సంబంధిత శాఖల పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఎక్సైజ్ అధికారులను వివరణ కోరగా వారు అందుబాటులోకి రాలేదని సమాచారం.