దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఆగ్రహం

రిపోర్టర్: రాము స్థలం: New Delhi

పరమశివుడు పేదోళ్లకు, శ్రీరాముడు ధనికులకు దేవుడంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మతాల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. చివరకు దేవుళ్లను కూడా రాజకీయాల్లో లాగుతూ హిందూ సమాజాన్ని అవమాన పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలను విభజించే అలవాటు ఉందని విమర్శిస్తూ, ఇతర మతాల దేవుళ్లపై మాట్లాడే దమ్ముందా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.