మద్యం షాపుల లాటరీ కేటాయింపు: కృష్ణా నంద్యాల జిల్లాల్లో విజయవంతంగా డ్రా ప్రక్రియ
రిపోర్టర్: హరి
స్థలం: Krishna
రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోందని కృష్ణా మరియు నంద్యాల జిల్లాల అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలో ఇరవై ఒకటి, నంద్యాల జిల్లాలో పదహారు మద్యం షాపులకు అధికారులు లాటరీ పద్ధతి ద్వారా విజేతలను ఎంపిక చేశారు. దరఖాస్తుదారుల సమక్షంలో ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ మరియు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.