త్వరలోనే పట్టాలెక్కనున్న కమల్ హాసన్ ఇండియన్ 3 మూవీ
రిపోర్టర్: రమేష్
స్థలం: చెన్నై
కమల్‌హాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇండియన్ 2' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, 'ఇండియన్ 3' విడుదలపై సస్పెన్స్ వీడింది. ఈ సినిమా అటకెక్కినట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చుతూ మేకర్స్ త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. సేనాపతి పాత్రలో కమల్ మరోసారి అలరించనున్నారు.