పౌష్టికాహారంతోనే చిన్నారుల ఆరోగ్య వికాసం: అంగన్వాడీ కార్యక్రమంలో సిడిపిఓ కృష్ణవేణి
రిపోర్టర్: Devendra Reddy
స్థలం: అనపర్తి
పౌష్టికాహారాన్ని అందించడం ద్వారానే చిన్నారుల్లో ఎదుగుదల మెరుగై ఆరోగ్యంగా ఉంటారని సిడిపిఓ కృష్ణవేణి స్పష్టం చేశారు. అనపర్తి లోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మాసం కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొని మాట్లాడారు. చిన్నారులకు పాలు, గుడ్లతో పాటు పండ్లు ఇవ్వాలని సూచించారు.