వైఎస్సార్సీపీకి మాజీ కార్పొరేటర్ గుడ్‌బై: త్వరలోనే రాజకీయ భవిష్యత్ ప్రకటిస్తానని స్పష్టీకరణ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: విజయనగరం రూరల్
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పదిహేనో డివిజన్ మాజీ కార్పొరేటర్ అల్లు చాణక్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు నగర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం వ్యక్తిగత కారణాల వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పార్టీలో లేకపోయినా డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతూ, త్వరలోనే తదుపరి రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చాణక్య వెల్లడించారు.