జైభారత్ ఆసుపత్రి సేవలకు మూడు లక్షల విరాళం
రిపోర్టర్: sujith reddy
స్థలం: నెల్లూరు అర్బన్
నెల్లూరు అర్బన్ ప్రాంతంలోని జైభారత్ ఆసుపత్రి చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి నెల్లూరు వాస్తవ్యులు మాచవోలు గౌరీశంకర్, కుప్పంచి సుగుణావతి మూడు లక్షల రూపాయల విరాళం అందజేశారు. ఈ చెక్‌ను సింహపురి వైద్య సేవా సమితి అధ్యక్షులు పొన్నలూరు సీతారామిరెడ్డికి దాతలు అందించారు. భవిష్యత్తులోనూ సంస్థకు సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, దాతల బంధువులు పాల్గొన్నారు.